
జీహెచ్‌ఎంసీలో 27 మంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్(న్యాక్) ఇంజినీర్లపై వేటు వేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో న్యాక్ ఇంజినీర్లు డబ్బులు తీసుకున్నట్లు కమిషనర్‌కు పలువురు బాధితులు స్వయంగా ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విభాగాన్ని రంగంలోకి దింపి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీశారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 100 మంది న్యాక్ ఇంజినీర్లు ఉండగా, ప్రధానంగా 27 మంది అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
- 0 Comments
- Hyderabad