హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్రం అత్యవసర అడ్వయిజరీ జారీచేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) ఒక ప్రకటన విడుదలచేసింది. భద్రతాకారణాల దృష్ట్యా ఇరాన్ దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన భారత నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని కోరింది.

