భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నగరంలో డిజిటల్ పేమెంట్లకు చిరువ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. చిన్న దుకాణాలు, వీధి వ్యాపారులు ఇలా ఏ దుకాణంలో చూసినా “నో యూపీఐ….ఓన్లీ క్యాష్ (No UPI,Only Cash )” అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. బెంగళూరులో రోడ్డు పక్క ఫుడ్ స్టాళ్లు, తోపుడు బండ్లు, ఫుట్పాత్ దుకాణాలతో సహా బెంగళూరులో అనధికారికంగా వ్యాపారాలు చేసుకునే వారికి జీఎస్టీ నోటీసులు వచ్చాయి. టాక్స్ అఫీషియల్స్ నుండి వేధింపులు రావచ్చనే భయంతో యూపీఐ పేమెంట్స్కు నో చెబుతున్నారు.

