కన్నడ చిత్రం ‘కేడీ: ద డెవిల్’ లోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట తీవ్ర వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో నటించిన బాలీవుడ్ నటి నోరా ఫతేహీపై అలీగఢ్‌కు చెందిన ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా అనే మతపరమైన సంస్థ ఫత్వా జారీ చేసింది. ఈ పాటలోని సాహిత్యం ఇస్లామిక్ బోధనలకు విరుద్ధంగా ఉందని సదరు సంస్థ పేర్కొంది. నోరా ఫతేహీ స్పందిస్తూ.. ఈ పాట హిందీ వెర్షన్లో తనకేమీ సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

