కేంద్ర ఎన్నికల సంఘంపై తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. SIR విచారణకు హాజరు కావాలని, నోబెల్ గ్రహీత అమర్తసేన్‌కు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ఇప్పటికే టీమ్ ఇండియా పేసర్ మహమ్మద్ షమీ, తృణమూల్ కాంగ్రెస్ఎంపీ, నటుడు దేవ్‌కు కూడా ఈసీ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించారు. అమర్తసేన్ ఒక నోబెల్ గ్రహీత, దేశం గర్వించదగ్గ, ఆయనను విచారణకు ఎలా పిలుస్తారు? బెంగాల్ ప్రజలను బీజేపీ ఈసీ లక్షంగా చేసుకున్నాయి. ” అని అభిషేక్ ఆరోపణలు చేశారు.

