
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినది. వాయుగుండం రీతిలో 36 గంటల్లో బలవంతంగా పెరగవచ్చు అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావం ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
తీర ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.