
దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది. అదే సమయంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక, కేరళను ఈశాన్య రుతుపవనాలు తాకినట్లు వెల్లడించింది. ఈ పరిణామాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో జోను వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.