
ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థ ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల గుర్తింపు, 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను
గుర్తించి వెంటనే ఈ-చలాన్ పోర్టల్‌కు అందిస్తుంది. హై రిజల్యూషన్ కెమెరాలు, డిజిటల్ బ్రెయిన్ కమాండ్ సెంటర్ ఇందులో కీలక భాగాలుగా ఉంటాయి. ఈ ఏఐ వ్యవస్థను క్రమంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.