నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై విచారణ ఢిల్లీకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) నుంచి కొన్ని వివరణలు కావలసి ఉన్నందున విచారణ వాయిదా వేసినట్టు స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే శనివారం వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రూ. 2000 కోట్ల విలువైన ఆస్తులను మోసపూరితంగా స్వాదీనం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఆరోపిస్తూ ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.

