నేపాల్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యువ నేత బాలేన్ షా తన చర్యలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పదవి దక్కిన వెంటనే ఆడంబరాలకు వెళ్లడం లేదు. సామాన్య ప్రజల మధ్యకు వచ్చి నేరుగా వారితో మమేకమయ్యారు. ఎటువంటి భారీ భద్రతా వలయాలు లేకుండా వీధుల్లో కలియతిరుగుతూ, బాటసారులతో కరచాలనం చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఒక దేశ ప్రధాని హోదాలో ఉండి కూడా సాధారణ వ్యక్తిలా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

