
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నారా లోకేష్ రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. ముందుగా నేపాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రులతో కమ్యూనికేట్ అయి.. వారందర్నీ ఖాఠ్మాండూ విమానాశ్రయానికి చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా విశాఖకు తీసుకు వచ్చారు. 144 మందితో విమానం బయలుదేరుతున్న వీడియోను నారా లోకేష్ షేర్ చేసారు. ఇండిగో విమానం విశాఖపట్నం , తిరుపతికి బయలుదేరింది. 36 గంటల కృషితో వారి ముఖాల్లో కనిపించిన ఆనందం విలువైనదిగా చేసిందన్నారు.