మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తనపై వస్తున్న ఆరోపణలను పుట్టా మహేశ్ తోసిపుచ్చారు. తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో.. “నేను ఎలాంటి తప్పు చేయలేదు. కొందరు మిత్రులు ఆహ్వానిస్తేనే ఆ డిన్నర్‌కు వెళ్ళాను. ఏలూరు ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను” అని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.

