హిట్ మ్యాన్ భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ..2008లో తాను తొలిసారి ఆసీస్ పర్యటనకు వచ్చానని, నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనన్నాడు. తాము (కోహ్లీ, రోహిత్) క్రికెటర్లుగా మళ్లీ ఆసీస్ పర్యటనకు వస్తామో లేదో తనకు తెలియదన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా తాను ఇక్కడ ఆడిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించానని తెలిపాడు. ఆసీస్ గడ్డపై ఆడడం తనకు ఎల్లప్పుడూ ఇష్టమేనని, కోహ్లీకి కూడా ఇలాగే ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా చెప్పాడు.

