తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ గుండె సంబంధిత పరిశోధన అండ్ శిక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కూడా ఒక డాక్టర్‌నే.. అయితే మీరు శరీరానికి చికిత్స చేసే వైద్యులైతే.. నేను సమాజంలోని రుగ్మతలను నయం చేసే సోషల్ డాక్టర్‌ను’ అని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే క్రమంలో తనను తాను సామాజిక వైద్యుడిగా అభివర్ణించుకున్నారు.

