స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతికి వారు అందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా వారి పోరాటం కొనసాగిందని గుర్తుచేశారు. దళిత బహుజన కులాలకు, రాజకీయ ఆర్థిక, తదితర రంగాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబు జగ్జీవన్ రామ్క మనమందిచే ఘన నివాళి అని పేర్కొన్నారు.

