
వైఎస్ఆర్ కడప జిల్లాలో మహానాడు ముగిసిన అనంతరం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం ఈనెల 31న ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.