పర్యావరణ పరిరక్షణ, భూతాపం (Global Warming) పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహించే ‘ఎర్త్ అవర్’ కార్యక్రమం నేడు (మార్చి 28న) జరగనుంది. ఈ సందర్భంగా రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అనవసరమైన విద్యుత్ దీపాలను మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను ఆర్పివేసి ఈ ప్రపంచవ్యాప్త ఉద్యమంలో భాగం కావాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ (WWF) 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.

