
హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈ మాసం నేడు ప్రారంభమవుతోంది. “న కార్తీక నమో మాసః, న దేవం కేశవాత్పరం! న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాస్తమమ్!!”* అని స్కంద పురాణం లో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన నెల లేదు, కేశవుడికి సమానమైన దేవుడు లేడు, వేదాలకు సమానమైన శాస్త్రం లేదు, గంగకు సమానమైన తీర్థం లేదు అని అర్థం.