
ఎస్‌సి వర్గీకరణ అమలుకు ముహూర్తం ఖరారయ్యింది. ఏప్రిల్ 14 నుండి ఎస్‌సి వర్గీకరణ అమలులోకి రానుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. భారత రా జ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దశాబ్దాలు గా పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలులోకి తెచ్చామని ఆయన తెలిపారు.