నెల్లూరులో సంచలనం రేపిన పెంచలయ్య హత్య కేసు నిందితులని పట్టుకునే క్రమంలో నెల్లూరు రూరల్ పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈ ఘటనలో నిందితుడు, హెడ్ కానిస్టేబుల్కి తీవ్రగాయాలయ్యాయి. సీపీఎం ఆర్డీటీ కాలనీ శాఖ సభ్యుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య అనే వ్యక్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి మాఫియాని నడుపుతున్న అరవ కామాక్షమ్మ తొమ్మిది సభ్యుల గంజాయి గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకుని పెంచలయ్య హత్యకి పురమాయించినట్టు తెలుస్తోంది.

