శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తోంది. ఈ తుఫాను రేపు (ఆదివారం) తెల్లవారుజామునకు తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, మరియు దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 24 గంటల్లో నెల్లూరు,కడప,చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఫ్లాష్ ఫ్లడ్స్’ (ఆకస్మిక వరదలు) హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

