
నూతన భారత ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23న ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ కోసం కసరత్తు చేపట్టింది. తదుపరి సీజేఐ పేరును సూచించాలంటూ జస్టిస్ గవాయ్కు లేఖ రాసింది ప్రభుత్వం. ఈ మేరకు లేఖ సాయంత్రం లేదా శుక్రవారం చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే, తర్వాతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యే అవకాశం ఉంది.