తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి కేసీఆర్కు లేదన్నారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు
తీసుకువచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరుగాంచిందని తెలిపారు. దక్షత కలిగిన పాలన చంద్రబాబు చేస్తున్నారని వెల్లడించారు. దేశ, విదేశాలు సైతం తమ నాయకుడిని హర్షిస్తుంటే కేసీఆర్ మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత అంటూ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

