
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. టెరిటోరియల్ ఆర్మీలో నీరజ్‌కు లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదాను ప్రదానం చేశారు. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని ఆ ప్రకటలో వెల్లడించింది. గతంలో నీరజ్ చోప్రా భారత సైన్యంలో సుబేదార్‌గా వ్యవహరిచారు.