
భారత్-అమెరికా సంయుక్తంగా భూగోళాన్ని పరిశీలించేందుకు తొలిసారిగా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి. ఈ ప్రయోగం తర్వాత నిసార్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. ఈ ఉపగ్రహం 743 కి.మీ ఎత్తులో తిరుగుతూ అడవులు, పంటలు, హిమపర్వతాలు, సముద్రాలు అన్నింటినీ గమనిస్తుంది. వర్షాలు కురుస్తున్నా, వాతావరణం సహకరించకపోయినా NASA-ISRO రాడార్ సిస్టమ్స్ డేటా సేకరిస్తూనే ఉంటుంది.