పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూములను, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, భూసేకరణ , పునరావాస ప్యాకేజీ కింద మూడో విడతగా రూ.226.61 కోట్ల చెక్కును ఆయన నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

