
కోకాపేట వద్ద నియో పోలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్‌ను సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హెచ్ఎండీఏ నిర్మించిన నియోపోలిస్, కోకాపేట్ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ ట్రంపెట్‌ను నిర్మించారు. నియో పోలిస్ ప్రాంతంలో భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. దీంతో నియోపోలిస్, కోకాపేట ప్రాంతంలో భారీగా ఐటీ కంపెనీలు తరలి రానున్నాయి. ఫ్యూచర్ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని
ఈ ట్రంపెట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ట్రంపెట్ జంక్షన్‌తో మోకిల, శంకర్పల్లి ప్రాంతాలకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.