
నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డీవీ (కావ్య) కృష్ణారెడ్డి క్వారీ దగ్గర కొందరు డ్రోన్‌తో సంచరించడం కలకలం రేపింది. జలదంకి మండలం అన్నవరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది.. వారి దగ్గర మారణాయుధం కూడా లభ్యమైందని సమాచారం. తనను హత్య చేసేందుకే వారు వచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఇదంతా చేశారని.. తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని ఆరోపించారు.
డ్రోన్ ఎగరేసినవారిని పట్టుకుని అడిగితే వారు ప్రతాప్ కుమార్ రెడ్డి పంపినట్లు చెప్పారన్నారు.