భారత మహిళల బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేశారు. బ్యాడ్మింటన్ ఆటకు వీడ్కోలు పలికారు. ‘నేను రెండేళ్ల కిందటే ఆడటం ఆపేశాను. ఎంతో ఇష్టంతో నా అంతట నేను ఆటలోకి వచ్చా. ఇప్పుడు నా అంతట నేను నిష్క్రమిస్తున్నా. ఆర్థరైటిస్ వచ్చింది.. కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. గతంలోలాగా ఎక్కువ సమయం తీవ్రమైన శిక్షణను తట్టుకోలేకపోయాను. ఇక చాలు. ఇంతకంటే నేను కష్టపడలేను అని. అందుకే ఆటకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను’ అని సైనా చెప్పుకొచ్చింది.

