
తనను కుటుంబానికి దూరం చేసేందుకు కుట్ర పన్నిన వారిని వదలిపెట్టనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తల్లిని, తండ్రిని కాకుండా వేరు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కవిత తన స్వగ్రామం చింతమడకలో గ్రామస్తులతో కలిసి నేడు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఒగ్గుడోలు, డప్పు వాయిద్యాలతో స్థానికులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు చింతమడక శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు.