
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో కొత్త నియామకం జరిగింది. భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త అమిత్ క్షత్రియకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించింది. అంతరిక్ష సంస్థ ఆయనను నాసా కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. అమిత్ గత 20 సంవత్సరాలుగా నాసాతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ సంస్థ అగ్ర నాయకత్వంలో చేరాడు. అమిత్ నియామకం చంద్రుడు, అంగారక గ్రహాల కోసం అమెరికా ప్రణాళికలకు కొత్త ఊపునిస్తుందని నాసా తాత్కాలిక నిర్వాహకుడు సీన్ పి. డఫీ అన్నారు.