
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. ఆమెను “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు – 2025”కి ఎంపిక చేసినట్లు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ప్రకటించింది. వ్యాపార రంగంలో ఆమె చూపిన సమర్ధనేతృత్వం, సామాజిక సేవల్లో చేసిన విశేష కృషి, మహిళా సాధికారత పట్ల చూపిన అంకితభావం కారణంగా ఈ అవార్డును అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.