ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి నాయకుడు ఉద్భవిస్తున్నాడంటూ నాగబాబు నారా లోకేష్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మధ్యాహ్న భోజనంలో పొరపాటు జరిగితే, అది పాఠశాల తప్పు అయినప్పటికీ మంత్రి లోకేష్ బాధ్యత తీసుకున్నారని ప్రశంసించారు.

