హైదరాబాద్ బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. బతుకమ్మ కుంట పరిధిలోని కోర్టు వివాదంలో హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారని ఆయనపై ఎ.సుధాకర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

