నాటో సైనిక కూటమిలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా బారి నుంచి డెన్మార్క్‌లోని గ్రీన్‌లాండ్ ద్వీపానికి భద్రత కల్పించేందుకు ఐరోపా దేశాల సేనలు రంగంలోకి దిగాయి. అణ్వస్త్ర దేశం ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, నార్వే, స్వీడన్ సహా వివిధ ఐరోపా దేశాల సైన్యాలను గ్రీన్‌లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్‌ను మర్యాదగా తమకు విక్రయించకుంటే, స్వాధీనం చేసుకుంటామని డెన్మార్క్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు.

