ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సే దేవా పలు కీలక విషయాలను వెల్లడించారు నాకు నేనుగా తెలంగాణా పోలీసుల ముందు లొంగిపోలేదు. ఒక పనిమీద బయటకు వెళుతుంటే.. పోలీసులు పట్టుకున్నారు. దీంతో లొంగిపోవాల్సి వచ్చింది. మావోయిస్టు పార్టీ ఈ మధ్య ఉనికి కోల్పోయిందని తాను భావించానని దేవా తెలిపారు. టవర్ వెపన్స్, హెలికాప్టర్ షాట్ వెపన్స్‌ను పోలీసుల నుంచే తీసుకెళ్లామని ఆయన చెప్పారు. అడవుల్లో ఉన్న మరికొందరు మావోయిస్టులపై తాను ఎలాంటి కామెంట్స్ చేయనని ఆయన వ్యాఖ్యానించారు.

