
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల విచారణకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రెండోసారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. తాను నిర్దోషినని, పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి తాజాగా వాంగ్మూలం ఇచ్చారు.