
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బాల కార్మికులను రెస్క్యూ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.
ఎస్పీ నేతృత్వంలో పోలీస్ శాఖ,ఇతర విభాగాల సమన్వయం ఒక్క జూలై నెలలోనే 106 మంది పిల్లలను రెస్యూ చేశారు. వీరిలో 94 మంది బాలలు, 12 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఎక్కువగా బీహార్, చత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు.