ఏపీ రాజధాని అమరావతికి జగన్ పేరుతో ‘మావిగన్’ సరే.. పులివెందులకు అవినాశ్ పేరుతో ‘అవి గొడ్డలి’ అని పెట్టాల్సిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ‘ఎంతసేపూ నరకాలి.. చంపాలి.. నాశనం చేయాలి’ ఇదే వైకాపా సిద్ధాంతమని మండిపడ్డారు. మావిగన్ కు తక్కువ ఖర్చు అయితే.. మూడు రాజధానులు ఎందుకన్నారు? జగన్ ఐదేళ్లు నిద్రపోయారా? మావిగన్ మీద మా వైఖరి అడుగుతున్నారు. ఎవరైనా జోక్ వింటే బిగ్గరగా నవ్వుతారు.. మా నవ్వే ‘మావిగన్’ మీదున్న అర్థం అని అన్నారు.

