మధ్యప్రదేశ్లో జరిగిన ఒక ధార్మిక కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “దాదా జీ బాబా” ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక ప్రత్యేక వేడుకలో భాగంగా సుమారు 11,000 లీటర్ల పాలను పుణ్యనదిగా భావించే నర్మదా నదిలో అర్పించారు.నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. “పాలను నదిలో పోసే బదులు వేలాది మంది పేద పిల్లలకు లేదా అనాథ శరణాలయాలకు పంపిణీ చేస్తే బాగుండేది” అని కొందరు అభిప్రాయపడుతున్నారు. నదిలో భారీ మొత్తంలో పాలు కలవడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

