
ప్రముఖ తమిళ నటుడు ఆర్యకు ఐటి శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన నివాసంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం చెన్నైలోని అన్నానగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ‘‘సీ షెల్’’ రెస్టారెంట్లపై సోదాలు చేపట్టారు. గతంలో ఈ రెస్టారెంట్ చైన్‌తో సంబంధం ఉండటంతో ఆర్య నివాసంలోనూ తనిఖీలు జరిపారు.