
జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో పాక్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేసిన్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్‌లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.