దేశ రాజధాని ఢిల్లీలో ఒక నకిలీ టూత్‌పేస్ట్ తయారీ యూనిట్‌ను పోలీసులు సీజ్ చేశారు. ప్రముఖ బహుళజాతి బ్రాండ్ “సెన్సోడైన్” (Sensodyne) పేరును వాడుకుంటూ, తక్కువ నాణ్యత గల పదార్థాలతో టూత్‌పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనిపై దాడులు నిర్వహించిన ఢిల్లీ పోలీసులు, నిందితుల మోసాన్ని బయటపెట్టారు. సుమారు 3,000 కి పైగా నింపిన టూత్‌పేస్ట్ ట్యూబ్‌లు, మరో 10,000 ఖాళీ ట్యూబ్‌లతో పాటు, టూత్‌పేస్ట్ తయారీకి సిద్ధంగా ఉంచిన 130 కిలోల మిశ్రమాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

