
మార్కెట్లో నకిలీ రూ. 500 నోట్లు చెలామణి అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. నకిలీ నోట్లను గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. MANI (మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్) అనే పేరుతో యాపిల్ స్టోర్‌తో పాటు ప్లే స్టోర్‌లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. కెమెరా ఆన్ చేసి రూ. 500 నోటును స్కాన్ చేయాలి. దీంతో సదరు నోట్ అసలా.? నకిలీనా.? అన్న విషయాన్ని యాప్ చెప్పేస్తుంది. ఈ యాప్‌ను ఉపయోగించడానికి ఇంటర్నెట్ కూడా అసవరం లేదు.