ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలో డయేరియా వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. చందాపురంలో అనేక మంది అస్వస్థతకు గురికావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. దీని నివారణలో భాగంగా ఏప్రిల్ 8 వరకు మాంసం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిషేధం కేవలం మాంసం షాపులకే పరిమితం కాకుండా హోటళ్లు, కర్రీ పాయింట్లకు కూడా వర్తిస్తుంది. చికెన్, మటన్ తో పాటు చేపల విక్రయాలను కూడా పూర్తిగా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

