విపత్తు టైంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరిస్తున్న టైంలో వర్షాలు పడుతున్నందున ఆటంకం లేకుండా చూడాలని సూచించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కేంద్రానికి ఒక మండల స్థాయి అధికారి నియమించాలని తెలిపారు. వర్షాలు ఎక్కువగా ఉన్న చోట ధాన్యాన్ని సమీపంలోని పంక్షన్ హాల్‌లోకి తరలించాలని చెప్పారు.

