ఈ ఏడాది దేశవ్యాప్తంగా దీపావళి అమ్మకాలు రూ.6.05లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.5.40 కోట్ల విలువైన వస్తువ వ్యాపారం.. రూ.65వేల కోట్ల విలువైన సర్వీసెస్ వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) నివేదికను విడుదల చేసింది. ఇదే ఇప్పటి వరకు దేశ వాణిజ్య చరిత్రలో అతిపెద్ద పండుగగా నిలిచింది. దేశవ్యాప్తంగా 60 ప్రధాన కేంద్రాల్లో సీఏఐటీ రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహించిన సర్వే ఆధారంగా ‘డిటైర్డ్ దీపావళి పండుగ అమ్మకాలు 2025’ పేరుతో నివేదికను విడుదల చేసింది.

