
దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యం అవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించుకోవడమే కాకుండా, వెనుకబడిన రాష్ట్రాలకు అవసరమైన మద్దతు ఇవ్వాలన్నారు.