
దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చింది మోదీనే..నమో అంటేనే విక్టరీ అని మంత్రి లోకేష్ అన్నారు. మోదీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందనన్నారు. నమో అంటేనే విక్టరీ అని.. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు బుద్ది చెప్పారని పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా దేశ ప్రధానిగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారని గుర్తుచేశారు. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్నా తొలి ఏడాది ఎలా కష్టపడ్డారో ఇప్పుడూ అలాగే కష్టపడుతున్నారని.. భారత్‌ను తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ మారుస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు