భారత్‌తో జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ టీమ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ ఎలాంటి పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. జట్టు ప్రదర్శనపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మహ్మద్ యూసుఫ్, జావేద్ మియాందాద్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేలవమైన ప్రదర్శనతో దేశ పరువును తీశారని ఆగ్రహ్రం వ్యక్తం చేశారు. బాబర్ ఆజమ్, కెప్టెన్ సల్మాన్ ఆఘా, షహీన్ అఫ్రిది తదితరులపై వారు దుమ్మెత్తి పోశారు.

